17. అష్ట ప్రమాణములు

17. అష్ట ప్రమాణములు

            ప్రత్యక్ష ప్రమాణంబు అనుమాన ప్రమాణంబు ఆగమ ప్రమాణంబు అర్థాపత్తి ప్రమాణంబు ఉపమాన ప్రమాణంబు అభావ ప్రమాణంబు సంభవ ప్రమాణంబు ఐతీహ్య ప్రమాణంబును నివి వస్తు సిద్ధికి అష్ట ప్రమాణంబులు.  వీటియందు ఘటాది దర్శనంబు ప్రత్యక్ష ప్రమాణంబనదగు.  ధూమంబుచేత అగ్నిజ్ఞానంబు ఆనుమాన  ప్రమాణంబనదగు.  మరియు  ననుమాన ప్రమాణంబునకు ప్రతిజ్ఞా, హేతు, దృష్టాంతంబులను అంగత్రయంబులు గలవు.  వీటియందు పర్వతంబున అగ్నిగలదనుటె ప్రతిజ్ఞయనదగు. ధూమంబుగలదైన కారణంబె హేతువనందగు.  మహాననంబెట్లిట్లనుటె దృష్టాంతంబనదగు.  యధాదృష్టార్థవాదియైన ఆప్తుని వచనంబుచె నదీ తీరాదులందు ఫలాదిసద్భావజ్ఞానంబె ఆగమ ప్రమాణంబనదగు.  పగలు భోజనములేని దేవదత్తుని దేహము యొక్క పీనత్వంబుజూచి రాత్రి భోజనంబు చేయునని తెలియుటె దృష్టార్థపత్తి ప్రమాణంబనదగు, జీవితుండైన దేవదత్తుండు గృహంబున లేదనిన స్థానాంతరంబున నుండునని తెలియుటె శృతార్ధాపత్తి ప్రమాణంబనదగు.  గోసదృశోగవయః యనువాక్య శ్రవణానంత్తరంబున వనంబునందున్న యప్పుడు తద్ద్విషయ జ్ఞానంబె ఉపమాన ప్రమాణంబనబడు.  ఈ భూప్రదేశంబున ఘటంబు లేదనుట చేతను అఘటాభావజ్ఞానంబె అభావప్రమాణంబనదగు, సహస్ర సంఖ్య యందు శత సంఖ్య గలిగియుండునను జ్ఞానంబె సంభవ ప్రమాణంబనదగు.  ఈ వటవృక్షంబున యక్షుండు గలండను లోక వాతచేతను యక్షవిషయజ్ఞానంబె ఐతిహ్య ప్రమాణంబనదగు.

            మరియు నీప్రమాణములందు చార్వాకులకు ప్రత్యక్ష ప్రమాణంబొక్కటిజైనబౌద్ధ వైషీకులకు అనుమాన ప్రమాణంబుతో గూడా రెండు, సాంఖ్యులకు ఆగమంబుతో గూడా మూడు ప్రమాణంబులున్యాయైకదేశులకు ఉపమానంబుతో నాల్గు ప్రమాణంబులుప్రాభాకరులకు ఆర్థాపత్తితోడనైదు ప్రమాణంబులుభాట్టులకు వేదాంతులకు అభావంతోగూడి ఆరు ప్రమాణంబులుపౌరాణికులకు సంభవంబును ఐతిహ్యంబును గూడి యెనిమిది ప్రమాణంబులు దెలియపలికె.