36. దృగ్వివేకం

36. దృగ్వివేకం


            మృత్తిక యొక్కటె నామరూపంబులచేత ఘటాది బహుభేదంబైనట్లు, దీపమొక్కటె ఘటాది వివరంబులచేత బహుత్వంబు గల్గియున్నట్లు, మారుత మొక్కటె వంశరంధ్రంబుల మధురమంద్రాది విభిన్నంబైనట్లు, స్వరమొక్కటె గాయకుని కరణవృత్తి చేత నానారాగంబైనట్లు, గగన మొక్కటె గృహాద్యుపాధిచె యనేకంబైనట్లు, ధ్వని యొక్క వాద్యభేదంబుచే యనేకంబైనయట్లు, సువర్ణ మొక్కటె వాచాభృణంబుచే కటకమకుటాది బహుభూషణంబైన యట్లు, జలమొక్కటె వాయువశంబున ఫేనతరంగాది సముదాయంబైనట్లు, సభయొకటె కదళీమండాది ఛిద్రంబులందు కరితురగాది విచిత్రంబుగా దోచినట్లు, రవిచంద్రాదులు జలకుంభాదులందు అనేకులై దోచినట్లు, లెక్కవక్కటె బహు బిందువులచేత దశశత సహస్రాదులయినట్లుచిత్తొక్కటియందు పూర్వోక్త జీవేశ్వరాది ఖేద వ్యవహారంబులు కల్గెననునివి  మొదలైనవె దృగ్వివేకంబని తెలియందగును.