2. చాతుర్వర్ణములు

2. చాతుర్వర్ణములు

            కమ్మె, కంనడి, ఆంధ్ర, ద్రావిడలను నాలుగు జాతులు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులను చాతుర్వర్ణంబులు. వారియందు గర్భాదాన, పుంసవన, సీమంత, ఉన్నయన, జాతకర్మ, నామకరణ, ఉపనిషత్క్రమణ, అన్నప్రాశన, చౌల, ఉనయన, మహానామ్మిక, మహావ్రత, ఉపనిషత్తు, శోభన, ఉద్వాహ, జార్ధ్వ దైహికంబులనదగిన షోడశ కర్మంబులుంగలిగి యజిన, యాజనాధ్యయనాధ్యాపక దాన, అదాన, ప్రతిగ్రహంబులను షట్కర్మంబులు గలిగి శివభక్త్యాది సకల సద్గుణంబులు గలవాడె బ్రాహ్మణుండు.  తదనంతరంబున, ప్రజాపాలన, యజన, అధ్యాపనవర్జన, దుష్టమృగపక్షి శతృసంహార, అన్నదాన, వస్త్రదాన, కన్యాదాన, భూదాన, హిరణ్యదాన, గోదాన, ఉభయముఖీగోదాన, మహిషీదాన, అశ్వదాన, శ్వేతాశ్వదాన, కాళముఖీదాన, మహామేరుదాన, కల్పవృక్షదాన, విద్యాదానాది మహాదానంబులు గలిగి, తద్దానార్ధంబుగా దేశకాల పాత్రంబులెరింగి విష్ణుభక్యాది కర్మ యుక్తుండగువాడె క్షత్రియుండు.  పిదప ప్రథమస్థాన ద్వితీయస్థాన తృతీయస్థాన చతుర్థస్థాన పంచమస్థానంబులాదిగా ముప్పదారు స్ధానంబులు క్రమంబుగా ఏకం, దశం, శతం, సహస్త్రం, దశసహస్రం, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి, శతకోటి, అర్బుద, నిర్బుదం, ఖర్వం, మహాఖర్వం, పద్మం, మహాపద్మం, క్షోణి, మహాక్షోణి, శంఖం, మహాశంఖం, క్షితి, మహాక్షితి, క్షోభం, నిధి, మహానిధి, సాగరం, మహాసాగరం, హరి, మహాహారి, సంఖ్య మహాసంఖ్య, ఫణి, మహాఫణి, క్రమం, మహాక్రమంబులన, నివెగణనలు.  మరియు ఏకా, యక్క, భూమి, చంద్ర యివి మొదలయినవి ఏకసంజ్ఞలు. ది, ద్వం, ద్వ, ద్వయ, ద్వితియ్య, యుగ్మ, యుగళ, యుగ, ఉభయ, బాహు, పాద, పక్ష, నయనములను నివి ద్వితీయ్యంబునకు సంజ్ఞలు. త్రయ, తృతియ్య, హరనయన, అగ్ని, పుర, పర, రత్నాదులు మూడనుటకు సంజ్ఞలు. చతురగతి, కషాయ, వెద, వర్ణ, ఆశ్రమ, సముద్ర మొదలుగా గలవె నాల్గనుటకునగు సంజ్ఞలు. పంచ, హరి, వక్త్ర, వ్రత, ఇంద్రియ, బాణ, వీషయ, పాండవ, భూతాదులు ఐదనుటకు సంజ్ఞలు. షట్‌, ద్రవ్య, ఋతు, రస, స్కంధముఖి, వేదాంగ, కర్మ దర్శన, అర్థంబాదిగా గల సంజ్ఞలు ఆరనుటకను, సప్త, ముని, గిరి, రాజ్యాంగ, తురగ, ధాతు, సభాంగ, స్వర, సాగర మొదలుగాగలవి ఏడనుటకు సంజ్ఞలు.  అష్ట, వసు, మద, పాశాది సంజ్ఞలు యెనిమిదనుటకును, నవ, నిధి, రంధ్ర, రస, గ్రహ, భక్త్వాది సంజ్ఞలు తొమ్మిదనుటకగును. బిందు, శూన్య, నాస్తి, అనుస్వార, గగన సంజ్ఞలు సున్న పేరగు.  ఇట్లు సకల సంఖ్యా సంజ్ఞ లెరిగి భాగలక్షణంబులు దెలిసి గణితాదులంగుఱించి క్రముకాది సమస్త వస్తువుల ప్రమాణించులేఖ, వడ్డి, వాత, శ్రయం, పత్రం, పట్టి, బంగారు, వన్నెలు, పవడంబుల కణుజులు, మణులచౌలు, రత్నంబుల సూత్రపరీక్ష, వజ్రమంజాడి, పచ్చరతులు మొదలయిన భేదంబులెరింగింప రూకల యెత్తు గద్ధెణం, బదినాల్‌గౖెెెనకర్షం, బదిల్‌గైనహలం, బదియిరువదైన వీశె, బదియైదైన నొక్కతులం, బదియిరువదయిన నొక్క భారం, ఆ భారవలు పదియైన నొక్క యచితంబునవి కర్పూరం బాదిగాగల పదార్ధంబులు తూనికెలెరింగి, మరియు నొక్క సాలిగె పేరునికుంజం, బదినాల్‌ గైనకుడుబం, బదినాల్‌గైన ప్రస్తం, బదిరెండైన నొక్క వాహం, బదిరెండైన నొక్క ఆఢకం, బదినాల్‌గైన నొక్క ద్రోణం, బడియైదైన నొక్కఖారియగునని ధాన్యాదుల కొలత లెరింగి, వాణిజ్య, కృషి, గోరక్ష, సూర్య భక్త్యాది కర్మయుక్తుండె వైశ్యుండు, మరియు బ్రాహ్మణాది వర్ణత్రయ సేవ క్షేత్ర పాలన సకల దేవతాభక్త్వాది కర్మయుక్తుండు శూద్రుండనబడు.