45. వాయువులు

45.  వాయువులు


            ప్రాణవాయువు హృదయ స్థానంబున నుండి వుఛ్వాస నిశ్వాసంబులు జేయు. ఆపాన వాయువు గుదస్థానంబుననుండి మలమూత్రంబులం త్యజింపుచుండు. సమాన వాయువు నాభిస్థానంబున నుండి భుజించిన యన్నరసంబు సర్వాంగంబులకుం పంచిపెట్టు. ఉదాన వాయువు కంఠస్థానంబున నుండి వుఛ్వాస నిశ్వాసంబులచె ఉద్గారంబు జేయుచుండు. వ్యానవాయువు సర్వాంగంబుల యందుండి దేహంబు ధరియించి యుండు.  పిదప నాగ వాయువుచె దేహంబు బిగువుడుపుట, ఆవలించుట గలుగును. కూర్మవాయువుచే త్రేన్పు వెక్కిళ్ళు గలుగును. కృకర వాయువుచే తుమ్ము దగ్గులు గల్గును. దేవదత్తవాయువుచే నవ్వు, మాటయు గలుగును.  ధనంజయ వాయువుచే శోక రాగంబగు.  నా ధనుంజయ వాయువు మృతంబైన అయిదునాళ్ళు విడవకయుండి దేహంబుబ్బి బగలంజేసి పోవును.  మరియు నాగాది వాయువులు బాహ్యవాయులనదగి, వాగాది కర్మేంద్రియ చేష్టా హేతువు లయ్యుండు, ప్రాణాదివాయువులె శోత్రాది జ్ఞానేంద్రియ చేష్టా హితువులయ్యుండు.  వైరంభ, ముఖ్య, ప్రభంజన, అంత్తర్యామి సౌజ్ఞలు గల నాల్గు జీవసంబంధమైన వాయువుల మానసాద్యంతఃకరణ చేష్టకారణంబై యుండు.