43. గుణత్రయం

43. గుణత్రయం


            సత్వగుణ, రజోగుణ, తమోగుణంబులనెడిదె గుణత్రయంబు. ప్రకాశ, ప్రవృత్తి, మోహంబులనునివె సత్వాదిగుణరూపంబులు. వైకారిక, తైజస, భూతాదులనునివి సత్వాది గుణపర్యాయ నామంబులు.  వాటియందు సత్వగుణంబుచె మానసాద్యంతఃకరణంబులును శ్రోత్రాది జ్ఞానేంద్రియ పంచకంబును గలిగె.  రజోగుణంబున వాగాదికర్మేంద్రియ పంచకంబును ప్రాణాదివాయు పంచకంబునుంబుట్టె.  తమోగుణంబుచే ఆకాశాది భూత పంచకంబుదయించె.    భూతంబుల  పంచీకరణ  మేళనంబుచె బ్రహ్మాండ భువన శరీర ఘటాది విషయంబులుం జనించె.