19. కల్పితద్వయం

19. కల్పితద్వయం


            అధ్యారోపం బపవాదంబను నివె కల్పిత ద్వయంబులు.  వాటియందు వుండెడి రజ్జు శుక్తి స్తాణ్వాదు లందు క్రమంబుగా లేని అహి రజిత చోరాదులను కల్పించినట్లు సద్రూప బ్రహ్మంబునలేని మాయా ప్రపంచకల్పన ఆధ్యారోప మనదగు.  ఇది యహిగాదు రజ్జువె, యిది రజితంబుగాదు శుక్తియె, వీడు చోరుండుగాడు స్తాణువె సరియనినట్లు, విచార ముఖంబుచేత ప్రపంచంబంతయు మిథ్య, మరి బ్రహ్మంబె సత్యంబనుటె అపవాదం బనబడును.