4. అవైదీక శాస్త్రములు

4. అవైదీక శాస్త్రములు

             బృహస్పతి, అహర్తసుగతులన దగినవారిచే గ్రమంబుగా చెప్పంబడిన, చార్వాక, జైన, బౌద్ధంబులనెడి అవైదిక శాస్త్రనితంబందు చార్వాకంబున పృథివ్యాది చతుర్భూత వికారంబైన జగత్తునందు సుఖమే స్వర్గంబు, దుఃఖమెనరకంబుగాక వేరెస్వర్గ నరకంబులు లేవని జెప్పియుండు.  మరియు జైనంబునందు శిద్ధ బద్ధ నారకులను పురుషత్రయము లక్షణంబును విడ్డీశ, వడ్డామలేశ, జ్వాలనికల్ప, పద్మావతీకల్ప, శారదాకల్ప, కుక్కుటనాధాది కల్పంబులచే మంత్రౌషధాది ప్రయోక్తృవులైన పరమసిద్ధులున్ను, లూనకేశ, దిగంబర, పాణిపాత్ర, మయూరపింఛ, పంచమలధారణంబును, అనృత, చౌర్య, పరదార, అతికాంక్ష, హింసలు మొదలయినవి వర్జించుటలనెడి పంచాణు వ్రతంబులచేత మధు, పలాందువలు, మొదలైన నిషిద్ధ ద్రవ్యంబుల విడిచి తప్తశిలా శయనాదులు గలిగి, వుగ్రతపంబాచరించెడి మునుల వృత్తులచే హేమచంద్ర, నాగచంద్ర, నేమిచంద్ర, మేఘచంద్ర, మాఘచంద్ర, అహర్త, ఆదినాధ, అగ్గళ, పార్శ్వనాధ, సౌగత, శృతకీర్తి, శ్రీమతి, కామరహిత మునిస్వాములనెడి చతుర్వింశ తీర్థంకర చరిత్రంబులను, స్యాదస్తి, స్యాన్నాస్తియను నిధి మొదలుగా గల సప్తభంగులను, జీవ, సజీవ, నిర్జీవ, నిర్జర ఆశ్రమబంధ   మోక్షములను   సప్త పదార్ధంబులను ప్రతిపాదింపబడుచుండును.  బౌద్ధంబు భూమ్యాదిగా బుద్ధికడగాగల త్రయోవింశతి తత్త్వాత్మక ప్రపంచంబంతయు దీప జ్వాల లెట్లట్ల క్షణికంబులని చెప్పుచుండు.  సౌత్రాంత్తిక, వైభాషిక, మహాయానక, సంస్కృతంబులని చతుర్విధంబులైయుండు.  పిదప సత్యనాధ, సతోకనాధ, ఆదినాధ, అనాదినాధ, అకుళితనాధ, మతంగనాధ, మత్స్యేంద్రనాధ, ఘటయంత్రనాధ, గోరక్షనాధాదు లనదగిన నవనాధ సిద్ధులచే కల్పితంబులయిన కాలయామళాదులే హింసా మైధునాది నిషిద్ధ కర్మంబులు గల శాస్త్రాంతరంబులు.  వాటియందు అభిచారకర్మ జనిత ఆధిద్వారా అకాలమృతిరూప మరణంబనెడి సుప్తి, విష, మూర్ఛ, అదృశ్యకరణ, లక్షణ, మోహనములనెడి అగ్నిస్తంభ, జలస్తంభ, ఇంద్రియస్తంభ, ఖడ్గస్తంభ, జిహ్వస్తంభ, గతీస్తంభాది రూప స్తంభనంబులనెడి పూర్వసుఖాశ్రయానికి రసనాత్మక ఉచ్ఛాటనంబనెడి వస్త్రాభరణ వాహన వనితాదివస్తు నిజస్తానాగత లక్షణాకర్షణం బనదగిన షట్కర్మంబులును, రాజవశ్య, జనవశ్య, స్త్రీవశ్యంబులును జ్వరభూత, గ్రహావేశంబులును, పాదుకాసిద్ధి, అంజనసిద్ధి, ఘటికాసిద్ధి, మూలికాసిద్ధి, రసనాదంబులను సిద్ధులు జెప్పంబడును.