33. రూపద్వయం

33. రూపద్వయం


            సమిష్టి, వ్యష్టియను నివే జీవేశ్వర విభాగోపాయ ద్వయంబు.  వాటియందు అనేక వృక్షంబులు గల వనంబొక్కటె యని తెలియునట్లు అనేక జీవుల తన ఆత్మయను యభిమానం బీశ్వరునకు సమిష్టిరూపంబగు.  ఇది యొక్క వృక్షం బిదియొక్క వృక్షంబని భిన్న భిన్నంబులుగా లక్షించినట్టుల ప్రత్యేక ప్రత్యేక దేహాభిమానంబె జీవునకు వ్యష్టిరూపంబగు.