25. అభావచతుష్టయం

 25. అభావచతుష్టయం

            ప్రాగాభావ,       ప్రధ్వంసాభావ,        అన్యోన్యాభావ, అత్యంతా భావంబులనునివి బ్రహ్మయొక్క నిత్యపదంబున్‌దోచు అభావ చతుష్టయము.  వీటియందు మృత్తికమొదలగు వాటియందు ఘటాదికంబులు మొదలు లేదనుటె ప్రాగాభావంబనదగు.  పుట్టినఘటంబు భిన్నంబైన మరిలేదనుటె ప్రధ్వంసాభావం బనదగు.  ఘటమందు పటంబును పటమందు ఘటంబును లేదనుటె అన్యోన్యాభవంబనబడు.  గగన కుసుమాదులె అత్యంతా భావంబనదగు.