28. ఆత్మత్రయం

28. ఆత్మత్రయం


            జీవాత్మ, అంతరాత్మ, పరమాత్ములనెడివె ఆత్మత్రయంబు.  వాటియందు తప్తాయః పిండంబువలెనె దేహంబులతోడ సంబంధములచె సకల సంసార వ్యవహారంబు గల యతండె జీవాత్మయగు.  కమల పత్రోదకంబువలెనె జీవుని సంసారంబు పొందియు, పొందని యతండె అంతరాత్ముండు. లోక వ్యవహారంబునకు సూర్యుండెట్లట్లు జీవాంతరాత్ముల వ్యావహారిక సాక్షియె పరమాత్మయనదగు.