37. దృశ్య వివేకం

37.  దృశ్య వివేకం


             అనాదిగా చంద్రునికళంకంబు చంద్రునె కమ్మి చంద్రుని యాఛ్ఛాదనంబు చాయనోపక చంద్రునిచె తానె వెలుంగుచు యుండునట్లు.  నన్ను నేనెరుంగ నను లోకప్రసిద్ధమైన వ్యవహారంబు తోచక స్ఫోటకాది కార్యగమ్యయై అందు ఆత్ముని నమ్మి ఆత్ముని ఆచ్ఛాదింపకనె ఆత్మునిచె తెలిపింప చేసుకొనుచూ నుండుగావున యట్లు, అగ్ని యొక్క దాహక శక్తి మరి మణిమంత్రాది ప్రయోగంబుచేత తానె బంధింపబడు చుండుట వల్ల అగ్ని స్వరూపంబుగాక అగ్నిని విడిచి తోచక స్ఫోటకాది కార్యగమ్యయై యుండునట్లు, బ్రహ్మస్వరూపంబుగాకయు బ్రహ్మ విలక్షణంబుగా దోచక వియదాది కార్యగమ్యంబై అఘటితఘటనా సమర్థంబై సర్వానర్థంబునకు కారణంబైయుండునదె దృశ్యరూపమాయాశక్తి యనందగు.