48. ప్రకృతి కార్యోదయద్వయం

48.  ప్రకృతి కార్యోదయద్వయం


            ప్రకృతిచే కార్యోదయంబెట్లనిన క్రమసృష్టియని, యుగవత్సృష్టియని ద్విప్రకారంబులు.  వాటియందు మూల ప్రకృతిచేత మహత్తత్వంబు అహంకారంబు తన్మాత్రపంచకంబులను నివి సప్త ప్రకృతులు. వాటిచే పంచభూతముల యందున బ్రహ్మాండ దేహ ఘటాది ప్రపంచోదయంబె క్రమసృష్టియనదగు.  నిస్తరంగ సముద్రమందు వొక్కకాలంబున వాయువశంబుచే విచిత్ర ఫేన తరంగ బుద్బుదాదు లుదయించినట్లు సచ్చిదానందాత్మక బ్రహ్మంబునందు మాయామయి నామరూప ప్రసరంబును, యుగ వత్సృష్టి యగు.  ఈ ద్వివిధంబును శృతిసిద్ధంబౌటచే నిశ్చయంబగు.  అతిరోహిత బ్రహ్మస్వరూపుండగుటచే వికారంబులేని యీశ్వరునిచేత జడ ప్రకృతియందు కార్యోదయంబెట్లనిన యిచ్ఛాదికంబులేని సూర్యునిచే యత్నాదికంబులేని సూర్యకాంతంబునందు వహ్నియుద్భవించినట్లు పరశివునిచాత ప్రకృతియందు మహదాది కార్యోదయంబునకు విరోధంబు లేదు.