29. సంసారకల్పన

29. సంసారకల్పన


            జలంబున సూర్యుండు గదలెనన్నట్లునదియందు ఓడ నడిచినయడ తీరమందలి తరువులందు చలంబు దోచినట్లు, మేఘచయంబుల ధావనంబు చంద్రునిదన్నట్లు, గవాక్షత సూర్యాతపంబున హస్త చలనంబుచె ఆతప చలనంబనినట్లు, దేహ జనన మరణంబులు ఆత్మునికన్నట్లు నిర్వికారుండగు నాత్మునకు దేహాద్యుపాధులచేనైన జీవావస్థయే సంసార వ్యవహారంబు.